కలం, వెబ్ డెస్క్: మహారాష్ట్ర దివంగత డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) అంత్యక్రియలు నేడు బారామతిలోని (Baramati) విద్యా ప్రతిష్ఠాన్ గ్రౌండ్లో జరుగనున్నాయి. అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం అజిత్ పవార్ భౌతిక కాయం ఆయన స్వగ్రామమైన కాటేవాడికి (Katewadi) చేరుకుంది. కాసేపు ఇక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు.
మరోవైపు అజిత్ పవార్ అంత్యక్రియల కోసం ఎస్సీపీ-ఎస్సీపీ అధినేత శరద్ పవార్ బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానానికి చేరుకున్నారు. రాష్ట్ర సత్కారాలతో అజిత్ పవార్ (Ajit Pawar) అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు జరుగనున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అజిత్ పవార్ మృతిపై మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. అజిత్ పవార్ అంత్యక్రియలకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏకనాథ్ షిండే, రాష్ట్ర కేబినెట్ సభ్యులు హాజరు కానున్నారు. అలాగే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి ప్రముఖ రాజకీయ నాయకులు రానున్నారు.
Read Also: లిక్కర్ కేసులో ముగ్గురికి బెయిల్ మంజూరు
Follow Us On: Instagram


