epaper
Thursday, January 29, 2026
spot_img
epaper

కాకినాడ‌లో కంటైన‌ర్‌ను ఢీకొట్టిన లారీ.. వ్య‌క్తి స‌జీవ‌ ద‌హ‌నం

క‌లం, వెబ్‌ డెస్క్‌: కాకినాడ‌(Kakinada)లో ఘోర రోడ్డు ప్ర‌మాదం(Road Accident) చోటు చేసుకుంది. ఓ కంటైన‌ర్ వాహ‌నాన్ని(container vehicle) లారీ ఢీకొట్ట‌డంతో ఓ వ్య‌క్తి మృతి చెందాడు. జిల్లాలోని క‌త్తిపూడి స‌మీపంలోని రావికంపాడు జంక్ష‌న్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. గురువారం తెల్ల‌వారుజామున‌ ఓ లారీ వేగంగా వ‌చ్చి కంటైన‌ర్‌ను ఢీకొట్టింది. దీంతో కంటైన‌ర్‌లో మంట‌లు చెల‌రేగాయి. కంటైన‌ర్‌ ముందు భాగం మొత్తం మంట‌ల్లో చిక్కుకుంది. ఈ ప్ర‌మాదంలో కంటైన‌ర్ క్లీన‌ర్ స‌జీవ ద‌హ‌నం అయ్యాడు. స్థానికులు అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించ‌గా వారు అక్క‌డికి చేరుకొని మంట‌లు ఆర్పివేశారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని ప‌రిశీలించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>