కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి 2026 వార్షిక పరీక్షలకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. ఇంటర్మీడియట్ సైన్స్, ఒకేషనల్ విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షల (Inter Practical Exams) హాల్ టికెట్లు జనవరి 29 నుండి అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్లను సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించి పొందాలని బోర్డ్ కార్యదర్శి సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు (Inter Practical Exams) ఫిబ్రవరి 2 నుండి ఫిబ్రవరి 21 వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లలో ఉన్న వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలని సూచించారు. పరీక్షల సమయంలో బోర్డ్, కళాశాల అధికారులు జారీ చేసిన సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు తెలిపారు. హాల్ టికెట్లను కళాశాలల లాగిన్లలో అందుబాటులో ఉంచినట్లు విద్యామండలి ఒక ప్రకటనలో తెలియజేసింది.
Read Also: ఆదాయంలో మూడో వంతు అప్పులే.. 9 నెలల్లో రూ. 66 వేల కోట్లు
Follow Us On: Instagram


