కలం, ఖమ్మం బ్యూరో : పెళ్లి శుభకార్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, బాలుని మృతికి కారణమైన ఇద్దరు వ్యక్తులకు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం జిల్లా కోర్టు (Khammam Court) తీర్పు వెల్లడించింది. 2022 ఆగస్టు 1న కల్లూరు మండలం, శాంతి నగర్ కాలనీలో కంచె పోగు పెద్ద సత్యం ఇంట్లో పెళ్లి జరిగింది. ఈ వేడుకలో ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేసి, కరెంట్ వైర్లను నిర్లక్ష్యంగా వదిలి వేయడంతో కొత్తపల్లి రానా హుస్సేన్ అనే ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కారకులైన కంచె పోగు పెద్ద సత్యం, కంచెపోగు నరేశ్, కంచె పోగు లక్ష్మయ్య లను అరెస్ట్ చేశారు. విచారణ చేపట్టిన ఇన్ స్పెక్టర్ హనోక్ కోర్టులో (Khammam Court) ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దాదాపు మూడున్నరేళ్లు కోర్టులో వాదోప వాదనలు నడిచిన తర్వాత బుధవారం జిల్లా న్యాయమూర్తి కె.ఉమాదేవి నిందితులకు ఏడేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.
Read Also: కమ్యూనిస్టులు చెరోవైపు.. రసవత్తరంగా నల్లగొండ మున్సిపల్ ఎన్నికలు
Follow Us On : WhatsApp


