epaper
Wednesday, January 28, 2026
spot_img
epaper

అజిత్ పవార్ ఫ్లైట్ క్రాష్ : కీలక విషయాలు వెల్లడించిన DGCA

కలం, వెబ్​డెస్క్​: మహారాష్ట్రలోని బారామతి విమానాశ్రయంలో ఈరోజు ఉదయం లీయర్​జెట్​–45 ఎయిర్​క్రాఫ్ట్​ కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్​ పవార్ ​(Ajit Pawar) తోపాటు ఆ ఫ్లైట్​లోని మరో నలుగురు దుర్మరణం చెందారు. ఈ క్రమంలో ప్రమాదానికి సంబంధించి డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్​(DGCA) ఒక ప్రకటన విడుదల చేసింది. లీయర్​జెట్​–45, పైలెట్ల అనుభవం, ల్యాండింగ్​ సమయంలో ఎదురైన సమస్యల గురించి వివరించింది. దీని ప్రకారం..

లీయర్​జెట్​–45 విమానం ఉదయం 8గంటల 18 నిమిషాలకు బారామతి ఎయిర్​పోర్ట్​లోని ఎయిర్​ట్రాఫిక్​ కంట్రోల్​(ఏటీసీ)ని పైలెట్లు సంప్రదించారు. వాతావరణం బాగానే ఉందని, గాలివేగం పెద్ద సమస్యగా లేదని సమాచారమిచ్చారు. రన్​వే 11పై ల్యాండింగ్​కు ప్రయత్నించారు. తీరా ల్యాండింగ్​ సమయంలో పైలెట్లకు రన్​వే స్పష్టంగా కనిపించలేదు. దీంతో వాళ్లు ‘గో–అరౌండ్​’ పద్ధతిలో.. ల్యాండ్​ చేయకుండా మళ్లీ గాలిలోకి లేచి, మరోసారి ప్రయత్నించారు.

ఈ క్రమంలో మొదట రన్​వే కనిపించడం లేదని ఏటీసీకి సమాచారమిచ్చారు. కొన్ని సెకండ్ల తర్వాత కనిపించిందంటూ చెప్పారు. అయితే, ల్యాండింగ్​ చేస్తున్నారా? లేదా అనే విషయాన్ని వాళ్లు ఏటీసీకి ధ్రువీకరించలేదు. అనంతరం 8.44నిమిషాలకు రన్​వే దగ్గర విమానం మంటల్లో చిక్కుకున్నట్లు తెలిసింది. అత్యవసర సేవలు అక్కడికి చేరుకున్నాయి. రన్​వే11కి ఎడమవైపు పూర్తిగా దెబ్బతిన్న స్థితిలో విమాన శకలాలు కనిపించాయి. అంతేకాదు, అందులో ప్రయాణిస్తున్న డిప్యూటీ సీఎం అజిత్​ పవార్ ​(Ajit Pawar) తోపాటు, మరో నలుగురు దుర్మరణం చెందారు.

ఇదే విషయాన్ని ప్రకటనలో పేర్కొన్న డీజీసీఏ ఫ్లైట్​కు సంబంధించి అన్ని సర్టిఫికెట్లు సక్రమంగానే ఉన్నాయని చెప్పింది. అంతేకాదు, పైలెట్లకు 15వేల గంటలకు పైగా ఫ్లయింగ్​ అనుభవం ఉన్నట్లు తెలిపింది. విజిబిలిటీ సరిగా లేకపోవడం వల్లే.. అంటే పైలెట్లకు రన్​వే సరిగా కనిపించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని వెల్లడించింది.

కాగా, ప్రమాదం విషయం తెలిసిన వెంటనే విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ (AAIB) డీజీ నేరుగా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫ్లైట్​ డేటా, వాతావరణం, కమ్యూనికేషన్​, మానవ తప్పిదం తదితర అన్ని కోణాల్లో జరుపుతున్నారు. అయితే, తుది నివేదిక వచ్చేవరకు ప్రమాదానికి కచ్చితమైన కారణం వెల్లడించలేమని అధికారులు అంటున్నారు.

Read Also: అజిత్​ మృతిపై శరద్​ పవార్​ రియాక్షన్​​ ఇదే ​

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>