epaper
Wednesday, January 28, 2026
spot_img
epaper

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది : వైఎస్​ జగన్​

కలం, వెబ్​ డెస్క్​ : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆయన పేర్కొన్నారు. గత రెండేళ్ల చంద్రబాబు (Chandrababu) పాలనలో ప్రజలకు ఒక్క మంచి పని కూడా జరగలేదని ఆయన విమర్శించారు. సూపర్​ సిక్స్​, సూపర్​ సెవెన్​ అన్నీ అబద్దాలు అని తేలిపోయిందన్నారు. తాడేపల్లి ఆఫీసులో భీమవరం నేతలతో వైఎస్‌ జగన్‌ బుధవారం సమావేశం నిర్వహించారు.

వైఎస్​ జగన్​ మాట్లాడుతూ, ష్ట్రంలోని పలువురు జనసేన, టీడీపీ ఎమ్మెల్యేలు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని జగన్ ఆరోపించారు. రైల్వేకోడూరు, ఆముదాలవలస, సత్యవేడు వంటి నియోజకవర్గాల్లో జరిగిన ఘటనలను ఉదాహరణగా చూపుతూ, అధికార దుర్వినియోగంతో కేసులను నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. పండుగల పేరుతో అశ్లీల నృత్యాలు, కోడిపందాల వేలంపాటలను ప్రభుత్వం దగ్గరుండి ప్రోత్సహిస్తోందన్నారు. డీఎస్పీ ఊపేయ్.. కుదిపేయ్.. అంటున్నాడని, మనం ఏ సమజాంలో ఉన్నామో.. అర్థంకావడంలేదని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థ కూడా ఇందులో భాగస్వామి కావడం దారుణమని ఆయన అన్నారు.

తమ హయాంలో మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని జగన్ (YS Jagan) గుర్తుచేశారు. ప్రస్తుత అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల తరపున వైఎస్సార్సీపీ కార్యకర్తలు గొప్ప యజ్ఞం చేస్తున్నారని ఆయన కొనియాడారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తాను ఏడాదిన్నర పాటు పాదయాత్ర చేస్తానని, 150 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రతి మూడవ రోజు ప్రజా ఉప్పెనతో ప్రభుత్వాన్ని నిలదీస్తానని జగన్ ప్రకటించారు.

Read Also: నా వీడియోల‌ను నేనే సోష‌ల్ మీడియాలో లీక్ చేశా- బాధిత మ‌హిళ

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>