కలం వెబ్ డెస్క్ : మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నేత అజిత్ పవార్(66) (Ajit Pawar) బుధవారం ఉదయం పూణే జిల్లాలోని బరామతి(Baramati) సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అజిత్ పవార్ చేసిన అంకితభావంతో కూడిన ప్రజా సేవ, అపారమైన సహకారాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రజల పట్ల ఆయన చూపిన నిరంతర నిబద్ధత ఎల్లప్పుడూ గౌరవంతో స్మరించబడుతుంది. ఆయన మరణం పట్ల నా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఈ తీవ్ర దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
Read Also: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది : వైఎస్ జగన్
Follow Us On: Instagram


