కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాంప్లెక్స్ రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. నిన్న సంగారెడ్డి నుండి తరలించవద్దని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy), ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ (Chinta Prabhakar) ప్రభుత్వం, అధికారులపై ఫైర్ అవ్వగా.. ఈరోజు తాజాగా శంకుస్థాపన కార్యక్రమంను, మంత్రుల పర్యటనను స్థానిక పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Mahipal Reddy) బైకాట్ చేయడంతో వివాదం మరో మలుపు తిరిగింది.
పటాన్ చెరు (Patancheru) ప్రాంతానికి కేవలం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం మాత్రమే కావాలని మేము కోరామని, జిల్లా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం మాకు అవసరం లేదని మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరువు సబ్ రిజిస్టరు ఆఫీసు విషయంలో మంత్రులు, జిల్లా కలెక్టర్ వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని బాహాటంగా విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యేగా నన్ను సంప్రదించకుండా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ను ఎవరిని అడిగి పటాన్ చెరులో ఏర్పాటు చేస్తున్నారంటూ మహిపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థల కేటాయింపు విషయంలోనూ జిల్లా కలెక్టర్ మమ్మల్ని సంప్రదించలేదని, ఇష్టానుసారం చేస్తున్నందుకు మంత్రుల ప్రోగ్రాంను బైకాట్ చేస్తున్నామని మహిపాల్ రెడ్డి (Mahipal Reddy) ఫైర్ అయ్యారు. మరోవైపు వరుస వివాదాల మధ్య పటాన్ చెరు మండలం కర్దనూర్ లో జిల్లా ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిష్ట్రార్ ఆపీస్ కాంప్లెక్స్ ఏర్పాటుకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గడ్డం వివేక్ వెంకట స్వామి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి శంకుస్థాపన చేశారు.
Read Also: మూడే రోజులు.. అభ్యర్థుల ఖరారు ఎలా?
Follow Us On : WhatsApp


