కలం వెబ్ డెస్క్ : వైజాగ్ (Vizag) వేదికగా ఇవాళ జరగనున్న నాలుగో టీ20 (Fourth T20) పై ఆసక్తి పెరుగుతుంది. సిరీస్ ఇప్పటికే భారత్ (India) ఖాతాలోకి వెళ్లినా, వైట్‌వాష్ దిశగా మరో బలమైన అడుగు వేయాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగుతుంది. మూడు మ్యాచ్‌లలో వరుస విజయాలతో భారత్ 3-0 ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో నాలుగో గెలుపు కోసం సిద్ధమవుతుంది.
భారత జట్టులో కొన్ని మార్పులు కనిపించే అవకాశం ఉంది. తొలి మ్యాచ్‌లో గాయపడ్డ అక్షర్ పటేల్ పూర్తిగా కోలుకుని తిరిగి జట్టులోకి రావచ్చు. వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇచ్చే ఆలోచన కూడా చర్చలో ఉంది. అర్ష్‌దీప్ సింగ్ నెట్స్‌లో తీవ్రంగా సాధన చేయడంతో తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయం.
న్యూజిలాండ్ వైపు చూస్తే డారిల్ మిచెల్ మంచి ఫామ్ మేనేజ్మెంట్ దృష్టిని ఆకర్షిస్తుంది. అతడిని పై క్రమంలో పంపే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. క్రిస్టియన్ క్లార్క్, టిమ్ రాబిన్సన్లను జట్టు నుంచి విడుదల చేశారు. జేమ్స్ నీషమ్ ఎంపిక రేసులోకి వచ్చాడు. లాకీ ఫెర్గూసన్ మాత్రం ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండే సూచనలు ఉన్నాయి.
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ అన్ని విభాగాల్లో పట్టు చూపించింది. సమష్టి ప్రదర్శనతోనే సిరీస్‌ను మూడో మ్యాచ్‌కే ఖరారు చేసింది. ఇక న్యూజిలాండ్ అప్పుడప్పుడు మెరుపులు చూపించినా పూర్తి స్థాయి ఆట మాత్రం బయటపడలేదు. వైజాగ్‌లో అయినా సమగ్ర ప్రదర్శన ఇవ్వాలనే లక్ష్యంతో సాంట్నర్ జట్టు బరిలోకి దిగుతోంది.
భారత్ ప్లేయింగ్ ఎలెవన్:
సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా / అక్షర్ పటేల్, రింకూ సింగ్, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయి / వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా
న్యూజిలాండ్ ప్లేయింగ్ ఎలెవన్:
డారిల్ మిచెల్, టిమ్ సీఫర్ట్ (వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), కైల్ జేమీసన్, మ్యాట్ హెన్రీ, ఇష్ సోధీ, జేకబ్ డఫీ


