epaper
Wednesday, January 28, 2026
spot_img
epaper

సంజయ్ గాంధీ నుంచి అజిత్ పవార్ వరకు.. విమాన ప్రమాదాలకు బలైన ప్ర‌ముఖులు వీరే..!

క‌లం, వెబ్ డెస్క్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Ajit Pawar )బారామతిలో ఘోర విమాన ప్రమాదం(plane crash)లో మృతి చెందడం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటన దేశంలో ప్రధాన నేతలు విమాన, హెలీకాప్టర్ ప్రమాదాల్లో(Aircraft Crashes) మరణించిన విషాదకర ఘటనలను గుర్తు చేస్తోంది. అంతేకాకుండా దేశంలో విమాన భద్రతపై తీవ్ర చర్చకు తెరలేపింది. గతంలో సైతం ఇలాగే ఎంతోమంది ప్రముఖ రాజకీయ నాయకులు విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. ప్రజా సేవ చేసేందుకు ఎంతో భవిష్యత్తు ఉన్న నాయకులు ఇలా మృతి చెంద‌డం చాలా బాధాక‌రం.

సంజయ్ గాంధీ:

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత సంజయ్ గాంధీ(Sanjay Gandhi) 1980 జూన్ 23న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ విమానాశ్రయం సమీపంలో చిన్న విమానం కూలిపోవడంతో మృతి చెందారు. స్వయంగా విమానం నడుపుతూ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సంజ‌య్ గాంధీ మృతి చెందిన‌ సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడిగా కీలక పాత్రలో ఉన్నారు.

మాధవరావు సింధియా:

మధ్యప్రదేశ్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మాధవరావు సింధియా(Madhavrao Scindia) 2001 సెప్టెంబర్ 30న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలో విమాన ప్రమాదంలో మృతి చెందారు. రాజకీయ కార్యక్రమం కోసం ఢిల్లీ నుంచి కాన్పూర్‌కు వెళ్తుండగా విమానం కూలిపోయింది. మృతి చెందిన సమయంలో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు.

జీఎంసీ బాలయోగి:

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జీఎంసీ బాలయోగి(GMC Balayogi) 2002 మార్చి 3న పశ్చిమ గోదావరి జిల్లా కైవల్యపురం ప్రాంతంలో హెలీకాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. భీమవరం నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతి చెందిన‌ సమయంలో ఆయన లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నారు.

బిపిన్ రావత్:

ఉత్తరాఖండ్‌కు చెందిన భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్(General Bipin Rawat) 2021 డిసెంబర్ 8న తమిళనాడులోని కూనూర్ సమీపంలో హెలీకాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. సులూర్ ఎయిర్‌బేస్ నుంచి వెల్లింగ్టన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందే నాటికి ఆయన భార‌త్‌ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవిలో ఉన్నారు.

హోమీ జహాంగీర్ బాబా:

ముంబ‌యికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త హోమీ జహాంగీర్ బాబా(Homi Jehangir Bhabha) 1966 జనవరి 24న ఫ్రాన్స్‌లోని మోంట్ బ్లాంక్ ప్రాంతంలో జరిగిన విమాన ప్రమాదంలో చ‌నిపోయారు. లండన్ నుంచి వియన్నాకు అణుశక్తి సదస్సుకు వెళ్తుండగా విమానం కూలిపోయింది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి:

ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhara Reddy) 2009 సెప్టెంబర్ 2న కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో హెలీకాప్టర్ ప్రమాదంలో (Aircraft Crashes) మృతి చెందారు. హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లాలోని రాయచోటి ప్రాంతానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న‌ప్పుడే చ‌నిపోయారు.

విజయ్ రూపాని:

గుజరాత్‌కు చెందిన సీనియర్ నేత విజయ్ రూపాని(Vijay Rupani) అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల్ని క‌లిసేందుకు విమానంలో వెళ్తుండ‌గా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విజ‌య్ రూపాని గ‌తంలో గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు.

Read Also: అజిత్ పవార్ విమాన ప్రమాదానికి కారణమిదే..!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>