epaper
Wednesday, January 28, 2026
spot_img
epaper

సింగింగ్​కు అరిజిత్​​ సింగ్​ అల్విదా

కలం, వెబ్​డెస్క్​: బాలీవుడ్​ సింగర్​ అరిజిత్​​ సింగ్ (Arijit Singh)​ షాకింగ్​ డెసిషన్​ తీసుకున్నారు. ప్లేబ్యాక్​ సింగింగ్​ కెరీర్​కు గుడ్​బై చెబుతున్నట్లు ప్రకటించారు. సోషల్​ మీడియా వేదికగా మంగళవారం తన నిర్ణయాన్ని ప్రకటించారు. గాయకుడిగా ఇప్పటివరకు తన జర్నీ అద్భుతంగా కొనసాగిందన్నారు. ఇంతకాలం తన పాటలను ఆస్వాదించిన, తనను ప్రోత్సహించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. తనపై ప్రేమ, అభిమానం చూపిన అభిమానులకు థ్యాంక్స్​ చెప్పారు. అయితే, రిటైర్మెంట్​కు కారణాన్ని ఆయన వెల్లడించలేదు. సినిమాల్లో ప్లేబ్యాక్​ సింగర్​గా పాటలు పాడకపోయినప్పటికీ ప్రైవేట్​ ఆల్బమ్స్​కు, ఈవెంట్స్​కు, ఇతర కార్యక్రమాల్లో అరిజిత్​ పాటలు పాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పశ్చిమబెంగాల్​లోని ముర్షిదాబాద్​ జిల్లా జియాగంజ్​లో 1987, ఏప్రిల్​ 25న కక్కర్​ సింగ్​, అదితి సింగ్​ దంపతులకు అరిజిత్​ సింగ్ (Arijit Singh) ​ పుట్టారు. ఓ టీవీ చానల్​లో ప్రసారమైన ‘ఫేమ్​ గురుకుల్​’ రియాలిటీ షో ద్వారా గాయకుల ప్రపంచంలోకి  అడుగుపెట్టారు. 2011లో హిందీ సినిమా ‘మర్డర్​ 2’లోని ‘ఫిర్​ మొహబ్బతే’ పాట ద్వారా బాలీవుడ్​లో ప్రవేశించారు. 2013లో విడుదలైన ‘ఆషికీ 2’ సినిమాలోని ‘తుమ్​ హి హో’ పాట అరిజిత్​కు ఫిల్మ్​ఫేర్​తోపాటు అనేక అవార్డులు, ప్రశంసలు తెచ్చిపెట్టింది.

అనంతరం 2018లో రిలీజైన పద్మావతి సినిమాలోని ‘బింతే దిల్​’ పాటకు ఉత్తమ గాయకుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. 2022లో బ్రహ్మాస్త్ర పార్ట్​–1 సినిమాలోని ‘కేసారియా’ పాటకు రెండోసారి నేషనల్​ అవార్డు గెలుచుకున్నారు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు పొందారు. ఎంతో ప్రతిభ ఉన్న అరిజిత్​  38 ఏళ్ల వయసులోనే ప్లేబ్యాక్​ సింగింగ్​కు అల్విదా చెప్పడంపై ఆయన అభిమానులతోపాటు బాలీవుడ్​ సైతం షాక్​కు గురైంది.

Read Also: సంజూ శాంసన్‌కు మరో ఛాన్స్.. ఆశలు ఇంకా ఉన్నాయి !

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>