కలం, తెలంగాణ బ్యూరో : “ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రస్తుతం రాష్ట్రంలో లేరు… ఆయన అందుబాటులో లేరు కాబట్టే మంత్రులు వచ్చి నన్ను కలిసి వెళ్ళారు… పాలనాపరమైన అంశాలపై మేం చర్చించుకున్నాం.. ఇందులో తప్పేముంది?.. ఇలాంటి సమావేశాలు సర్వ సాధారణం…” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti) క్లారిటీ ఇచ్చారు. ముగ్గురు మంత్రులు ప్రజా భవన్‌లో తనను కలవడానికి సోమవారం సాయంత్రం వచ్చారని డిప్యూటీ సీఎం వివరించారు. పాలనాపరమైన అంశాలపై చర్చించడానికి తన దగ్గరకి వచ్చి చర్చించకూడదనే నియమం ఏమైనా ఉందా?.. అని ఎదురు ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా టూర్‌లో ఉన్న ఆయన ముగ్గురు మంత్రులతో ప్రజాభవన్‌లో జరిగిన భేటీపై అడిగిన ప్రశ్నకు పై విధంగా బదులిచ్చారు. సీఎం లేని సమయంలో నలుగురు కలిసి చర్చించడంపై అనుమానాలు రేకెత్తడంతో స్వయంగా డిప్యూటీ సీఎం వివరణ ఇచ్చారు.
సహజంగా ఎప్పుడైనా మంత్రులు కొన్ని అంశాలపై చర్చించడానికి ముఖ్యమంత్రిని కలుస్తూ ఉంటారని, ఆయన లేనప్పుడు డిప్యూటీ సీఎంగా తనను కలవడానికి వచ్చారని భట్టి విక్రమార్క (Deputy CM Bhatti) వివరించారు. మంత్రులు డిప్యూటీ సీఎంను కలవడంలో తప్పేముందని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎంను మంత్రులు కలవకూడదనే నిబంధనేదీ లేదన్నారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంగా తాను, మంత్రులు కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నామని, సమిష్టిగానే పాలన సాగిస్తున్నామన్నారు. పాలనాపరమైన అంశాలపై చర్చించుకోడానికి మంత్రులు, డిప్యూటీ సీఎం కలవడంలో విచిత్రమేమీ లేదన్నారు. ఇది జనరల్‌గా జరిగే ప్రాక్టీసే అని వివరించారు. సింగరేణి బొగ్గు గనుల టెండర్ అంశంలో అసలు అవినీతే జరగలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు.
Read Also: కర్ణాటక అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత
Follow Us On: Instagram


