కలం, డెస్క్ : అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తున్నది. ఆ ధాటికి ఓ ప్రైవేట్ విమానం కుప్పకూలిపోయింది (US Private Jet Crash). దీంతో ఏడుగురు కాలిబూడిదయ్యారు. ఎనిమిది మందితో కూడిన ‘బొంబార్డియర్ ఛాలెంజర్ 600’ ఫ్లైట్ అక్కడి కాలమానం ప్రకారం రాత్రి 7.45 గంటలకు మైన్ లోని బాంగోర్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయింది. ఆ సమయంలో పరిసరాల్లో భారీగా మంచు కురుస్తుండటంతో కొన్ని క్షణాల్లోనే రన్ వేపై కూలిపోయింది. వెంటనే మంటలు చెలరేగి.. అందులోని ఏడుగురు సజీవ దహనమయ్యారు. మరొకరు గాయాలతో బయటపడ్డారు. ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ బోర్డు అధికారులు విచారణ జరుపుతున్నారు. కొన్నిరోజులుగా యూఎస్ ను మంచు తుఫాన్ వణికిస్తున్నది. వాషింగ్టన్, న్యూయార్క్, న్యూజెర్సీ సహా పలు ఏరియాల్లో పెద్ద ఎత్తున మంచు కురుస్తున్నది. ఆదివారం ఒక్కరోజే 12వేల విమానాలు రద్దయ్యాయి.

Read Also: 30% సూసైడ్స్.. IIT కాన్పూర్ లో ఏం జరుగుతోంది?
Follow Us On: Sharechat


