కలం, వెబ్ డెస్క్: వివాహేతర సంబంధాలపై జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మంగళగిరిలో పార్టీ సంస్థాగత విషయాలపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. జనసేన పార్టీపై దుష్ట శక్తుల ప్రభావం ఉందని, కిరాయి వక్తలు, కిరాయి మాధ్యమాలు కలిసి కుయుక్తులు పన్నుతున్నాయన్నారు. వ్యక్తుల మధ్య జరుగుతున్న ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు, మానసిక బలహీనతలు, వ్యక్తిగత కుల విభేదాలను జనసేనకు ఆపాదించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు.
ముఖ్యంగా వివాహేతర సంబంధాల రచ్బను కూడా పార్టీపై రుద్దాలని మార్గాలను అన్వేషిస్తున్నాయని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఇటువంటి ప్రచారాలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజ్యాంగబద్ధంగా, ప్రజా సేవే పరమావధిగా జనసేన (Janasena) ప్రయాణం అప్రతిహతంగా కొనసాగుతుందని, అన్ని వేళలా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. జనసేనపై ఎటువంటి దుష్ట శక్తుల దృష్టి సోకకుండా కాపుకాస్తున్న జన సైనికులు, వీర మహిళలు, నాయకులు ప్రశంసనీయులు అని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు.
Read Also: లోకేష్ రెడ్‌బుక్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు
Follow Us On: Instagram


