కలం, డెస్క్ : బీఆర్ ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సిట్ నోటీసులను పొలిటికల్ ఆయుధంగా వాడుతున్నారంటూ మండిపడ్డారు. సింగరేణి బొగ్గు కుంభకోణాన్ని (Singareni Coal Scam) బయటపెట్టినందుకే తనకు నోటీసులు ఇచ్చారని హరీష్‌రావు చెప్పారు. ఆ తర్వాత బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా బొగ్గు కుంభకోణంపై గొంతెత్తినందుకు ఆయనకు నోటీసులు ఇచ్చారని చెప్పుకొచ్చారు హరీష్ రావు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాలపై రేపు గవర్నర్ ను బీఆర్ ఎస్ నేతలు కలుస్తున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు మాజీ ఎంపీ సంతోష్ రావుకు నోటీసులు ఇచ్చారని హరీష్ రావు తెలిపారు. అటు బొగ్గు కుంభకోణంపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి సిట్ నోటీసులు ఇస్తూ హడావిడి చేస్తున్నారని హరీష్ రావు (Harish Rao) విమర్శలు గుప్పించారు.
Read Also: మంత్రులు సమావేశమైతే తప్పేంటి : టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
Follow Us On: Sharechat


