కలం, డెస్క్: అటు కోలీవుడ్‌తోపాటు ఇటు టాలీవుడ్లో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న డైరెక్టర్ పేరు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj)! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా ఓ మూవీని తెరకెక్కిస్తున్న లోకేశ్.. ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. ఆయన దర్శకత్వంలో కార్తీ హీరోగా వచ్చిన ‘ఖైదీ’, కమల్ హాసన్ హీరోగా వచ్చిన ‘విక్రమ్’ సంచలన విజయాలను నమోదు చేసుకున్నాయి. రజినీకాంత్ హీరోగా లోకేశ్ డైరెక్షన్లోనే తెరకెక్కిన ‘కూలీ’ కూడా సక్సెస్‌ను అందుకుంది. అయితే.. కమల్, రజినీ కాంబినేషన్లో లోకేశ్ కనగరాజ్ డెరెక్టర్‌గా సినిమా తెరకెక్కాల్సి ఉండగా, ఎందుకో డైరెక్షన్ నుంచి ఆయన తప్పుకున్నారని ఇండస్ట్రీలో ప్రశ్నలు తలెత్తాయి. వీటికి తాజాగా లోకేశ్ క్లారిటీ ఇచ్చారు. తాను సరదాగా సాగే ‘లైట్ హార్టెడ్’ మూవీస్ చేయలేనని, అందుకే తప్పుకున్నానని బదులిచ్చారు.
స్క్రిప్ట్ చెప్తే చాలా ఉత్సాహం చూపారు
‘‘కూలీ సినిమా షూటింగ్ సమయంలో రజినీకాంత్ (Rajinikanth), కమల్ హాసన్ (Kamal Haasan)ను కలిశాను. ఇద్దరి కాంబోలో ఓ సినిమా చేయాలనుకుంటున్నట్లు వారు చెప్పారు. నాకు ఆ ఆఫర్ ఇచ్చారు. 46 ఏండ్ల తర్వాత ఇద్దరు స్టార్ హీరోలు కలిసి చేసే సినిమాకు డైరెక్టర్‌గా అవకాశం దక్కడం చాలా గౌరవంగా ఫీలయ్యాను. కానీ, ఆ టైమ్‌లో ఖైదీ 2 మూవీ చేయాల్సి ఉంది. అయినా.. నెలన్నరపాటు కూర్చొని స్క్రిప్ట్ రెడీ చేశాను. రజినీకాంత్ , కమల్ హాసన్ విడివిడిగా వినిపించాను. ఎంతో ఉత్సాహం చూపించారు. అయితే.. అప్పటికే ఇద్దరూ విడివిడిగా యాక్షన్ సినిమాలు చేస్తుండటంతో ‘మళ్లీ యాక్షన్ మూవీనే చేయాలా? లైట్ హార్టెడ్ మూవీ ఉంటే బాగుంటుందేమో’నని సందేహం వ్యక్తం చేశారు. వాళ్లు చెప్పింది కరెక్టే. కానీ, లైట్ హార్టెడ్ మూవీలు చేయడం నాకు చేతకాదు. ఇద్దరికీ ఇదే విషయం చెప్పి ప్రాజెక్టు నుంచి తప్పుకున్నా” అని లోకేశ్ కనగరాజ్ వివరించారు.
వచ్చే సంక్రాంతికి విడుదల
కమల్ హాసన్ – రజినీకాంత్ కాంబినేష్ ప్రాజెక్టు నుంచి లోకేశ్ (Lokesh Kanagaraj) తప్పుకున్నాక.. మరో డైరెక్టర్ సుందర్.సి పేరు వినిపించింది. కానీ, ఇటీవలే ఈ సినిమాను తెరకెక్కించే అవకాశం యువ దర్శకుడు శిబి చక్రవర్తికి దక్కింది. కమల్ హాసన్ ప్రొడ్యూసర్‌గా రజినీకాంత్ కథానాయకుడిగా ఈ మూవీ పట్టాలెక్కనుంది. ఇందులో కమల్ నటిస్తున్నారా? లేదా? అన్నది మాత్రం క్లారిటీ లేదు. ఏప్రిల్ లో షూటింగ్ ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాగా.. కమల్ హాసన్, రజినీకాంత్ కలిసి 1970లో దాదాపు 20 సినిమాలు చేశారు. ఆ తర్వాత ఎవరి ప్రాజెక్టు వారిదే! ఇప్పుడు మళ్లీ కలిసి వస్తుండటంతో అభిమానుల్లో ఫుల్ జోష్ నెలకొంది.
Read Also: విజయ్ దేవరకొండ మూవీలో మిల్కీబ్యూటీ..?
Follow Us On: Sharechat


