కలం, వెబ్ డెస్క్: సింగరేణి బొగ్గుబ్లాక్‌ల టెండర్లకు సంబంధించి తాను ఏ విచారణకైనా సిద్ధమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) వ్యాఖ్యానించారు. సింగరేణి కి సంబంధించి అసలు ఎటువంటి స్కామ్‌లు జరగలేదని పేర్కొన్నారు. ’నాకు ఏ కంపెనీ వాటా లేదు. నేను డబ్బుల విషయం పెద్దగా పట్టించుకోను. గతంలో నేను మంత్రి పదవిని కూడా వదిలేశాను.‘ అంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. “కిషన్ రెడ్డి లేఖ రాస్తే, దగ్గరుండి తాను విచారణకు సహకరిస్తానన్నారు. స్కామ్‌లు చేయడం, టెలిఫోన్ ట్యాపింగ్‌లు చేయడం బీఆర్ఎస్ నేతలకు అలవాటని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్ వివాదంపై సిద్ధంగా ఉందని, సమస్యలను అడ్డంకులేమీ లేకుండా పరిష్కరించవచ్చని కూడా తెలిపారు.
Read Also: ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు కృతజ్ఞతలు
Follow Us On : WhatsApp


