కలం, వెబ్ డెస్క్: ట్విట్టర్ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్ (Parag Agrawal) పేరు ఇప్పుడు ప్రపంచంలోని పారిశ్రామిక వర్గాల్లో మారుమోగుతున్నది. ఆయన సాధించిన ఘనత చూసి అంతా అబ్బురపడుతున్నారు. ఒకనాడు ట్విట్టర్ సంస్థ నుంచి అన్యాయంగా తొలగించబడ్డ పరాగ్ అగర్వాల్ నేడు ప్రపంచానికి తానేంటో చూపించాడు. సొంతంగా ఓ సంస్థను స్థాపించి 6 వేల కోట్ల టర్నోవర్ సాధించాడు. పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ లోనూ అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. ఆ సంస్థను అగ్రగామిగా నిలబెట్టాడు. కానీ ఎలన్ మస్క్ చేతుల్లోకి ట్విట్టర్ (ఎక్స్) వెళ్లిపోగానే పరాగ్ కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. అతడిని ఉద్యోగం నుంచి తొలగించాడు మస్క్. అనంతరం సొంతంగా ఓ ఏఐ ఆధారితను నెలకొల్పి సక్సెస్ అయ్యాడు పరాగ్.
ఇదీ పరాగ్ ప్రయాణం..
పరాగ్ అగర్వాల్ (Parag Agrawal) రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జన్మించారు. ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ట్విటర్‌లో సీటీఓగా పని చేసిన ఆయన 2021లో సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. కానీ 2022 అక్టోబర్‌లో ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన వెంటనే పరాగ్ అగర్వాల్‌ను పదవి నుంచి తొలగించాడు. ట్విటర్ నుంచి వైదొలగిన తర్వాత 2023లో పరాగ్ అగర్వాల్ Parallel Web Systems Inc. అనే ఏఐ స్టార్టప్‌ను ప్రారంభించారు. పాలో ఆల్టో కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వెబ్ ఇంటెలిజెన్స్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ప్రారంభ దశలోనే ఈ కంపెనీకి ఇన్వెస్టర్ల నుంచి సుమారు రూ.260 కోట్లు (30 మిలియన్ డాలర్లు) నిధులు సమకూరాయి. తాజాగా 2026 జనవరి నాటికి ఈ సంస్థ విలువ రూ.6,000 కోట్లకు చేరినట్టు అంచనాలు వస్తున్నాయి. అంటే రెండేళ్లలోనే ఈ సంస్థ 20 రెట్లు వృద్ధి నమోదు చేసింది.
జీపీటీ-5 కంటే మెరుగైన పనితీరు?
Parallel Web Systems అభివృద్ధి చేస్తున్న ఏఐ మోడల్స్ రియల్‌టైమ్ వెబ్ అండర్‌స్టాండింగ్, డేటా ఇంటిగ్రేషన్ వంటి కీలక అంశాల్లో GPT-5ను కూడా మించిపోతున్నదన్న కథనాలు టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ టూల్స్ ప్రస్తుతం రోజుకు మిలియన్ల పనులను నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. పరాగ్ అగర్వాల్‌కు ఇది కేవలం వ్యాపార విజయం మాత్రమే కాదు.. ట్విటర్ నుంచి తొలగించిన అనంతరం దక్కిన గొప్ప ఘనత. అదే సమయంలో, బిగ్ టెక్ కంపెనీలకు సవాల్ విసురుతున్న కొత్త తరహా ఏఐ స్టార్టప్‌లలో Parallel Web Systems ఒకటిగా నిలుస్తున్నది. అమెరికాలో స్థిరపడిన భారతీయ మూలాల టెక్నాలజిస్టులు గ్లోబల్ ఏఐ నాయకత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారనే దానికి పరాగ్ అగర్వాల్ ప్రయాణం మరో ఉదాహరణగా మారింది.
Read Also: విచారణను నిలిపేసేలా ఆదేశాలివ్వండి.. ఢిల్లీ హైకోర్టుకు ‘ఆపిల్’ కంపెనీ అప్పీల్
Follow Us On: Sharechat


