కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ధరణి పోర్టల్ (Dharani Portal) అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ బృందం ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ధరణి లొసుగులను అడ్డు పెట్టుకుని భారీ స్థాయిలో భూ అక్రమాలు జరిగినట్లు ఈ నివేదికలో తెలిపింది. ముఖ్యంగా సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పేరిట మార్చిన వైనం వెలుగుచూసింది.
ప్రభుత్వ భూములను కాజేయడంలో పలువురు బడా నేతలు, ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్లు ఆడిట్ బృందం గుర్తించింది. పోర్టల్ (Dharani Portal)లో ఉన్న సాంకేతిక లోపాలను వాడుకుని రికార్డులను తారుమారు చేసినట్లు ఆధారాలు సేకరించారు. 4,848 లావాదేవిల్లో లోటుపాట్లు గుర్తించారు. ఈ అక్రమాలపై ఇప్పటికే 9 జిల్లాల్లోని 35 మండలాల్లో క్రిమినల్ కేసులు నమోదైనట్లు నివేదిక వెల్లడించింది.
ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో అక్రమాలు వెలుగుచూడటంతో, ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విచారణను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా త్వరలోనే 31 జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించనున్నారు. భూభారతి పోర్టల్ (Bhu Bharati Portal) సహాయంతో ఉన్నత స్థాయి ఆడిట్ చేపట్టి, భూమికి లెక్క తేల్చాలని సర్కార్ భావిస్తోంది.
Read Also: మున్సిపల్ ఎన్నికలకు ఇన్ చార్జులను నియమించిన బీఆర్ఎస్
Follow Us On : WhatsApp


