epaper
Saturday, January 24, 2026
spot_img
epaper

నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. ఫర్నీచర్​ షాపులో ఎగిసిపడుతున్న మంటలు

కలం, వెబ్​ డెస్క్ : హైదరాబాద్​ లోని నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం (Nampally Fire Accident) సంభవించింది. స్టేషన్​ రోడ్డులోని బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్​ దుకాణంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్​ ఫ్లోర్​ నుంచి మంటలు పైకి వ్యాపిస్తున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైరింజన్లతో మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. భవనంలో ఇద్దరు చిన్నారు సహా మొత్తం ఆరుగురు చిక్కుకున్నట్లు సమాచారం.

కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..

బిల్డింగ్​ లోపల చిక్కుకున్న ఐదుగురిని రక్షించేందుకు అధికారులు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. వీరిలో ఇద్దరు 12 ఏళ్లలోపు ఉన్నట్లు సమాచారం. 10 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చిన సిబ్బంది.. సెల్లార్​ లో మొత్తం ఫర్నీచర్​ ఉండడంతో వారిని రక్షించడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చిక్కుకున్న వారిని గుర్తించడానికి రోబోను బిల్డింగ్ లోకి పంపించారు. హైదరాబాద్​ కలెక్టర్​ హరిచందన, సీపీ సజ్జనార్​ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇంకా రెండు గంటలయితే కానీ, పరిస్థితి గురించి చెప్పలేమని సీపీ సజ్జనార్​ వెల్లడించారు. పైకి షాపులా కనబడుతున్నా లోపల మొత్తం దూది, స్పాంజ్​, చెక్క, ఆయిల్​ తో నింపేయడంతో లోపలకి వెళ్లడానికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. జేసీబీ సహాయంతో వాటిని అధికారులు తొలగిస్తున్నారు. మరోపక్క తమ పిల్లలు ఎలా ఉన్నారో చెప్పాలని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

Read Also: క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేకపోతున్నారా.. ఇలా చేస్తే సిబిల్ స్కోర్ తగ్గదు..!

Follow Us On: Pinterest

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>