కలం, వెబ్ డెస్క్: కర్ణాటకలోని బాల్లారి (Ballari)లో బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి(Janardhan Reddy)కి చెందిన మోడల్ హౌస్కు శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. స్థానికులు మంటలను గమనించి కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ భవనం ఖాళీగా ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇటీవల ఫ్లెక్సీ వివాదం జరిగిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి (Nara Bharath Reddy) అనుచరులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు జనార్ధన్ రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సుమారు రూ.3 కోట్ల విలువైన ఈ మోడల్ హౌస్లో ప్రస్తుతం ఎవరూ నివసించడం లేదు. ఇటీవల దీన్ని అమ్మేందుకు జనార్ధన్ రెడ్డి (Janardhan Reddy) నిర్ణయించినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల కోసం ఆయన బెంగళూర్లో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది.
Read Also: సోమాలియా డిప్యూటీ పీఎం హిందీ స్పీచ్… అంతా ఫిదా
Follow Us On: Sharechat


