epaper
Friday, January 23, 2026
spot_img
epaper

విచారణలో రాధాకిషన్ రావు.. కేటీఆర్ క్లారిటీ..!

కలం, వెబ్ డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విచారణ పూర్తి అయింది. మొన్న మంగళవారం మాజీ మంత్రి హరీష్‌ రావును ఒక్కడినే సిట్ అధికారులు విచారిస్తే.. నేడు కేటీఆర్ తో పాటు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రాధాకిషన్ రావును పిలిచి విచారించినట్టు వార్తలు వచ్చాయి. గతంలో రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కేటీఆర్ ను లోతుగా ప్రశ్నించారని.. ఇద్దరినీ కలిపి ‘కాన్‌ఫ్రంటేషన్’ పద్ధతిలో విచారించినట్టు ప్రచారం జరిగింది. కేటీఆర్ ఏ ప్రశ్నకూ దాటవేయకుండా.. తప్పనిసరిగా సమాధానాలు ఇచ్చేలా సిట్ ప్లాన్ చేసిందని ఉదయం నుంచి మీడియాలో కథనాలు వచ్చాయి.

విచారణ ముగిసిన తర్వాత కేటీఆర్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రచారంపై స్పందించారు. ‘సిట్ విచారణలో కల్వకుంట్ల తారక రామారావు తప్ప.. ఏ రావు లేడు. కావాలనే ఫేక్ లీకులు ఇచ్చారు.. అలాంటివి ఎవరూ నమ్మొద్దు’ అని కేటీఆర్ కోరారు. మరోసారి విచారణకు పిలుస్తామని సిట్ అధికారులు చెప్పారని.. ఎన్ని సార్లు అయినా విచారణకు హాజరవుతానంటూ కేటీఆర్ తెలిపారు.

Read Also: మంత్రి సీతక్క పర్యటనలో బీఆర్ ఎస్, కాంగ్రెస్ నేతల తోపులాట

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>