కలం, నల్లగొండ బ్యూరో : తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని బీజేపీ సీనియర్ నేత డాక్టర్ లక్ష్మణ్ (Laxman) అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా కేంద్రంలో ఖేల్ ఇండియా ప్రోగ్రాం (Khelo India Programme) అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ (BJP) ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని, బీఆర్ఎస్ (BRS) తో పొత్తు ఉంటుందన్న పుకార్లు నమ్మొద్దనీ చెప్పారు. టాపిక్ డైవర్ట్ చేయడం కోసమే ఫోన్ ట్యాపింగ్ డ్రామా ఆడుతున్నారని తెలిపారు.
ప్రజా వ్యతిరేకతను కప్పి పుచ్చుకునేందుకు రేవంత్ ఆడుతున్న గేమ్ ప్లాన్ అని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలు లేవు.. పైసా అభివృద్ధి లేదని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలిస్తామన్న రాహుల్ గాంధీ పత్తా లేడని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై విసుగు చెందిన ప్రజలు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారని, ఇప్పుడు అనుభవిస్తున్నారని అన్నారు. 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని జోస్యం చెప్పారు.
Read Also: టీచర్‌గా మారిన కలెక్టర్.. విద్యార్థులకు పాఠాలు బోధించిన ఇలా త్రిపాఠి
Follow Us On: X(Twitter)


