కలం, వెబ్ డెస్క్: ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ నేతలను పోలీసులు కేసులు, విచారణ పేరుతో వేధిస్తున్నారని హరీశ్‌రావు (Harish Rao) వ్యాఖ్యానించారు. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు చేసిన వ్యాఖ్యలతో ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్న వేధింపులేనని అర్థమవుతున్నది. సిట్ (SIT) హెడ్‌గా ఉన్న నగర పోలీసు కమిషనర్ కూడా అదే తరహాలో మాట్లాడుతున్నారు. ప్రభుత్వ పెద్దలు, అధికారులు గులాబీ లీడర్లను, శ్రేణులను ఇబ్బంది పెట్టాలని చూస్తే వారిని వదిలిపెట్టేది లేదు. ప్రభుత్వం స్పష్టమైన దురుద్దేశంతో రిటైర్‌మెంట్‌కు దగ్గరగా ఉన్న అధికారులతో సిట్ ను ఏర్పాటు చేసి బీఆర్ఎస్ నాయకులను వేధిస్తున్నది. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చేటప్పటికి ఆ అధికారులు రిటైర్ అయ్యి సప్త సముద్రాలకు అవతలివైపు దాక్కున్నా రప్పిస్తాం‘ అంటూ హరీశ్‌రావు హెచ్చరించారు.
పోలీస్ ఆఫీసర్లు చట్టబద్ధంగా వ్యవహరిస్తే వారికి హుందా ఇస్తుందని హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. దావోస్‌లో (Davos) ఉన్న ముఖ్యమంత్రి చెప్పినట్లుగా ఆడితే అది పోలీసు అధికారులకే చెడ్డపేరు తెస్తుందన్నారు. సీఎం నుంచి వచ్చే తప్పుడు ఆదేశాలు, సూచనలను నమ్ముకుంటే అధికారులకు వారి కెరీర్ మీద మచ్చపడుతుందని సూచించారు. చట్టాన్ని అతిక్రమించి పొలిటీషియన్లు చెప్పినట్లు వ్యవహరిస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Read Also: చక్రబంధంలో కల్వకుంట్ల ఫ్యామిలీ
Follow Us On: Pinterest


