కలం, వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సిట్ విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలివచ్చారు. వీరిలో మాజీ మంత్రి హరీశ్ రావు కూడా ఉన్నారు. కేటీఆర్ ఒక్కరినే అధికారులు లోపలికి అనుమతించారు. జాయింట్ సీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి కేటీఆర్‌ను విచారించనున్నారు. కేటీఆర్ (KTR) విచారణ కోసం అధికారులు ప్రత్యేక ప్రశ్నలు రూపొందించినట్లు సమాచారం. ఈ నెల 20న ఇదే కేసులో సిట్ హరీశ్ రావును కూడా విచారించింది.
రాజకీయ ప్రేరేపిత కేసు :హరీశ్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఆరోపించారు. కేవలం కక్ష సాధింపు కోసం కొంతమంది పోలీస్ అధికారులను అడ్డుపెట్టుకొని రేవంత్ సర్కారు కుట్రకు పాల్పడుతోందని ఆరోపించారు. ఉద్దేశ్యపూర్వకంగా బీఆర్ఎస్ నేతలను వేధిస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం, ఈ – రేసు పేరుతో కొంతకాలం డ్రామా చేశారని.. ఇప్పుడేమో ఫోన్ ట్యాపింగ్ పేరుతో కుట్రకు తెరలేపారని ఆరోపించారు.
Read Also: చక్రబంధంలో కల్వకుంట్ల ఫ్యామిలీ
Follow Us On: Sharechat


