కలం, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా పుంగనూరులో భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ గన్‌మెన్ చెన్నారెడ్డి (BCY Chief Gunman) ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. పుంగనూరులోని (Punganur) టీచర్స్ కాలనీలో చెన్నారెడ్డి ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. చెన్నారెడ్డి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నారెడ్డి స్వస్థలం అనంతపురం జిల్లాలోని రేగడికొత్తూరు. కుటుంబ కలహాలే చెన్నారెడ్డి ఆత్మహత్యకు కారణం అని రామచంద్రయాదవ్ వెల్లడించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Read Also: లిక్కర్ కేసులో ఈడీ విచారణకు హాజరైన మిథున్ రెడ్డి
Follow Us On: Instagram


