కలం, వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)ను సిట్ విచారించనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్(BRS) ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసనలు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో ఓయూ(OU)లో పలువురు విద్యార్థి నేతలను ముందస్తు అరెస్ట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్వీ(BRSV) కార్యదర్శి జంగయ్యను పోలీసులు నేడు ఉదయం అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై విద్యార్థి నేతలు మండిపడుతున్నారు.
మరోవైపు నేడు కేటీఆర్(KTR) జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ, ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఫోన్ ట్యాపింగ్ కేసు(phone tapping case)లో సైతం నోటీసులు రావడం చర్చనీయాంశంగా మారింది. మూడు రోజుల ముందు ఇదే కేసులో హరీశ్ రావును సిట్ సుదీర్ఘంగా విచారించింది. హరీశ్ చెప్పిన సమాధానాల ఆధారంగా కేటీఆర్ విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


