కలం, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) కేటీఆర్‌కు సిట్ (SIT) పోలీసులు నోటీసులు జారీచేయడం బీఆర్ఎస్ కేడర్‌ను విస్మయానికి గురిచేసింది. ఎంక్వయిరీకి రావాల్సిందిగా పోలీసులు చెప్పడంతో హడావిడి చేయడంపై పార్టీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా జిల్లాల నుంచి భారీ స్థాయిలో తరలిరావాలంటూ పార్టీ ప్రధాన కార్యాలయం కేడర్‌కు, లీడర్లకు పిలుపునిచ్చింది. ఇదే కేసులో హరీశ్‌రావును (Harish Rao) మూడు రోజుల క్రితం విచారణకు పిలిచినప్పుడు జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ దగ్గర పార్టీ కేడర్ భారీ సంఖ్యలో హాజరయ్యారు. పోలీసుల ఎంక్వయిరీ ప్రక్రియను కూడా ప్రభావితం చేస్తారా అనే కామెంట్లు వినిపించాయి. ఫార్ములా ఈ-రేస్ కేసులో గతంలో కేటీఆర్ (KTR) ఏసీబీ, ఈడీ విచారణకు హాజరైనప్పటికంటే హరీశ్‌రావు ఎంక్వయిరీకి కేడర్ హడావిడి చేయడం, భారీ సంఖ్యలో హాజరు కావడంతో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో దాన్ని మించిపోయేలా పార్టీ ప్లానింగ్ చేస్తున్నది. బావకు వచ్చిన జనంకంటే ఎక్కువగా హాజరయ్యేలా వ్యూహం సిద్ధం చేసింది. ఆ ఆలోచనకు అనుగుణంగా జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు తరలి రావాలంటే పార్టీ ప్రధాన కార్యాలయం అప్పీల్ చేసింది.
బల ప్రదర్శనగా ఎంక్వయిరీ ప్రక్రియ :
వివిధ ఆరోపణలతో పోలీసుల ఎంక్వయిరీకి హాజరవుతున్న సందర్భాన్ని పార్టీ నేతలు పొలిటికల్ ఈవెంట్‌గా మల్చుకుంటున్నారు. బల ప్రదర్శనలకు వేదికగా మార్చుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గతంలో ఈడీ ప్రధాన కార్యాలయం (ఢిల్లీలో) దగ్గరా, ఆ తర్వాత విడుదల సందర్భంగా తీహార్ జైలు దగ్గరా కల్వకుంట్ల కవిత అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు హడావిడి చేశారు. ఆ తర్వాత కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ విచారణకు హాజరైనప్పుడూ శ్రేణులు అదే స్థాయిలో హడావిడి చేశారు. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ ఎంక్వయిరీ సమయంలో, తాజాగా హరీశ్‌రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిచినప్పుడూ ఇదే హడావిడి కొనసాగింది. ఇప్పుడు కేటీఆర్‌ను ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) విచారణకు కూడా అదే తరహాలో కేడర్‌ను హైదరాబాద్ రప్పించుకుని బల ప్రదర్శనకు వాడుకుంటున్నది పార్టీ నాయకత్వం.
Read Also: ఫోన్ ట్యాపింగ్ కేసు: అగ్రనేతల డిస్కషన్ ఇదే!
Follow Us On: Sharechat


