కలం, మెదక్ బ్యూరో : సర్పంచ్ గా మిమ్మల్ని గెలిపించింది ఊర్లో మందు బంద్ పెట్టడానికా.. లేక అభివృద్ధి చేయడానికా అంటూ మందు బాబులు గ్రామసభలో రెచ్చిపోయిన సంఘటన సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో జరిగింది. చౌటకూర్ మండలం కోర్పోల్ (Korpole Village) గ్రామసభలో మద్యపానం నిషేధంపై చర్చ .. సభలో రచ్చకు కారణమైంది. సర్పంచ్ సునితారెడ్డి గ్రామంలో మద్యపానం నిషేధిస్తూ బెల్టుషాపులు మూసేయాలని తీర్మానం చేసింది.
దీంతో మద్యపానం గ్రామంలో నిషేధించొద్దని మందుబాబులు గొడవకు దిగారు. బెల్టు షాపులు ఎలా బంద్ చేస్తారని మందుబాబులంతా ఆగ్రహించారు. మద్యపాన నిషేధం (Alcohol Prohibition) గురించి మందు బాబులు.. గ్రామ సర్పంచ్, మహిళలతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు కోర్పోల్ గ్రామం (Korpole Village) లో మద్యపానం నిషేధించాలని మహిళలు పట్టుబట్టారు. చివరికి గ్రామంలో మద్యపానం నిషేధం చేస్తున్నట్టు ప్రకటించి, గ్రామసభలో ఆమోదం తెలిపారు. నమ్మి ఓట్లు వేస్తే.. ఊళ్ళో మందు లేకుండా చేశారని మందుబాబులు శాపనార్థాలు పెట్టుకుంటూ వెళ్లిపోయారు.
Read Also: నిజామాబాద్.. మేయర్ అభ్యర్థుల గురి ఆ వార్డే
Follow Us On : WhatsApp


