కలం, వెబ్ డెస్క్: భూములున్నవారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భూముల విలువ పెంపుపై నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో భూముల విలువ పెంచాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వ, మార్కెట్ విలువకు మధ్య గ్యాప్ తగ్గింపు ఉందని, రాజధాని గ్రామాల్లో గతేడాది పెంచలేదని ఆయన వెల్లడించారు. ఎంత పెంచాలనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
టీడీపీ ప్రభుత్వం (TDP Govt) అధికారంలో వచ్చినప్పుడే భూముల విలువ పెంచాలని నిర్ణయం తీసుకుంది. మార్కెట్, ఇతర అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఏపీలో రాజధాని ప్రాంతాలు, డెవలప్‌మెంట్ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువ 10 నుంచి 15శాతం లేదా అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశాలున్నాయి.

Read Also: ఏపీలో క్రెడిట్ చోరీ రాజకీయం.. ఎవరికి లాభం..?
Follow Us On : WhatsApp


