కలం, వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Ram Charan – Trivikram).. ఈ ఇద్దరి కాంబో మూవీ గురించి మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అసలు ఈ క్రేజీ కాంబో ఎప్పుడో సెట్ అవ్వాలి కానీ.. ఇంత వరకు కుదరలేదు. ఇప్పుడు మరోసారి ఈ అపూర్వ కలయికలో రూపొందే మూవీ గురించి వార్తలు రావడం ఆసక్తిగా మారింది. ఈ వార్తల వెనకున్న వాస్తవం ఏంటి..?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. మెగా హీరోల్లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), అల్లు అర్జున్ లతో సినిమాలు చేశారు. బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. చరణ్ తో సినిమా గురించి గతంలో కథా చర్చలు జరిగాయి కానీ.. సెట్ కాలేదు. అయితే.. ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చిందని ప్రాజెక్ట్ సెట్ అంటూ టాక్ వినిపిస్తోంది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. చరణ్, త్రివిక్రమ్ (Ram Charan – Trivikram) కాంబో మూవీని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మించనున్నారని సమాచారం.
పవన్ కళ్యాణ్ క్రియేటీవ్ వర్స్క్ బ్యానర్ పై ఈ భారీ చిత్రాన్ని పవన్ నిర్మించనున్నారని వార్తలు వస్తున్నాయి. పవన్ తన బ్యానర్ ని పునరుద్ధరించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అది ఈ సినిమాతోనే స్టార్ట్ అవుతుందట. ఈ క్రేజీ కాంబోలో సినిమా వస్తే.. మెగా అభిమానులకు పండగే. అయితే.. చరణ్ ప్రస్తుతం పెద్ది షూటింగ్ బిజీలో ఉన్నాడు. దీని తర్వాత సుకుమార్ తో సినిమా చేయాలి. ఆ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా ఉంటుందా..? లేకపోతే పెద్ది తర్వాతే ఉంటుందా..? అనేది ఆసక్తిగా మారింది.
Read Also: సింగర్ ఎస్.జానకి ఏకైక కుమారుడు మృతి..!
Follow Us On: Instagram


