epaper
Friday, January 23, 2026
spot_img
epaper

ప్రభాస్, సుకుమార్.. కాంబో సెట్ అయ్యిందా..?

క‌లం, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ మూవీతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావడం.. ఆ సినిమా అనుకున్నతంగా ఆకట్టుకోకపోవడం తెలిసిందే. దీంతో విదేశాలకు వెళ్లిన ప్రభాస్ ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఫౌజీ సినిమాపై ఫోకస్ పెట్టనున్నారు. ఈ మూవీని ఈ ఇయర్ లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఎప్పటి నుంచో ప్రభాస్, సుకుమార్ (Prabhas – Sukumar) కాంబో మూవీ గురించి ప్రచారం జరుగుతుంది కానీ.. అఫిషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రావడం లేదు. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబో వార్తల్లో నిలిచింది. నిజంగా ఈ కాంబో సెట్ అయ్యిందా..?

ప్రభాస్, సుకుమార్ కలిసి సినిమా చేయబోతున్నారని.. ఈ సినిమాని హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇది నిజంగా డార్లింగ్ ఫ్యాన్స్ కు మాంచి కిక్ ఇచ్చే న్యూస్ అని చెప్పచ్చు. సుకుమార్ కథలు ఎంత కొత్తగా ఉంటాయో.. ఎంతలా కథపై కసరత్తు చేస్తారో తెలిసిందే. ఇక ఇద్దరూ కలిస్తే ఆ సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సుకుమార్ ప్ర‌స్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కోసం ఓ క‌థ సిద్ధం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంవత్సరమే ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది.

ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత ప్ర‌భాస్‌తో సుకుమార్ (Prabhas – Sukumar) వర్క్ చేయ‌డం ఖాయ‌మ‌ని ఇండస్ట్రీ ఇన్ సైడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఈ వార్త లీకైనప్పటి నుంచి ప్రభాస్ ను సుకుమార్ ఎలా చూపించబోతున్నారు..? ఏ తరహా కథతో సినిమా చేస్తారు..? యాక్షనా..? ఫ్యాక్షనా..? ఫ్యామిలీ సబ్జెక్టా..? ఇలా అనేక ప్రశ్నలు. ఈ కాంబో సెట్ చేయాలని కొంత మంది నిర్మాతలు ట్రై చేశారు కానీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ఈ క్రేజీ కాంబో సెట్ అయ్యిందని తెలిసింది. ఏది ఏమైనా ఈ భారీ, క్రేజీ మూవీ పట్టాలెక్కాలంటే.. కొన్నాళ్లు ఆగాల్సిందే.

Read Also:  2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం : నారా లోకేశ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>