కలం, నల్లగొండ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉన్నాయని ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ కు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఫిర్యాదు (BRS complaint) చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) బిఆర్ఎస్ పార్టీలో ఆందోళన కలిగించే విధంగా శాంతి భద్రతలకు విఘాతం కల్పించే రీతిలో, మాజీ ముఖ్య మంత్రి కెసిఆర్ ని, బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అవమానపరిచే విధంగా బిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టమని, పార్టీ జెండా దిమ్మెలు కూల్చివేయాలని వ్యాఖ్యానించడంపై వారు ఫిర్యాదు చేశారు.
సీఎం పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో (BRS Complaint) పేర్కొన్నారు. ఫిర్యాదు ఇచ్చిన వారిలో శాసన మండలి సభ్యులు మంకెన కోటిరెడ్డి, జడ్పి మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కరరావు, నోముల భగత్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టే మల్లికార్జున రెడ్డి నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, కొండూరు సత్యనారాయణ సయ్యద్ జాఫర్ జమల్ ఖాద్రి తదితరులు ఉన్నారు.
Read Also: ఖమ్మం.. పోరాట గాథల నిలయం: భట్టి
Follow Us On: Youtube


