కలం, స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు న్యూజిలాండ్ జట్టు (New Zealand Team)కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఆటగాళ్లు ఒకరి తర్వాత ఒకరుగా గాయాల బారిన పడుతుండటంతో జట్టు మేనేజ్మెంట్లో ఆందోళన పెరిగిపోతోంది. ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే, ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ గాయాల బారిన పడ్డారు. ఎస్ఏ20 మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తుండగా మిల్నే ఎడమ హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురయ్యారు. గాయం తీవ్రతపై వైద్య పరీక్షలు కొనసాగుతున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ తెలిపింది. వరల్డ్ కప్‌లో మిల్నే పాల్గొనగలడా లేదా అన్నదానిపై అనిశ్చితి నెలకొంది.
ఇండోర్‌లో జరిగిన వన్డేలో ఫీల్డింగ్ సమయంలో బ్రేస్‌వెల్‌కు (Michael Bracewell) ఎడమ కాల్ఫ్ మసిల్ గాయం తగిలింది. భారత్‌పై 2–1తో చారిత్రక వన్డే సిరీస్ విజయం సాధించిన వెంటనే ఈ ఎదురుదెబ్బ తగలడం జట్టుకు నిరాశ కలిగించింది. గాయం ఉన్నప్పటికీ బ్రేస్‌వెల్ నాగ్‌పూర్ చేరాడు. భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు జట్టు సిద్ధమవుతోంది. అతడి పరిస్థితిని కొన్ని రోజులు గమనించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ తెలిపారు.
తొలి మూడు టీ20 మ్యాచ్‌ల కోసం ఆల్‌రౌండర్ క్రిస్టియన్ క్లార్క్‌ను జట్టులోకి చేర్చారు. ఆటగాళ్ల రాకపోకలు, గాయాల ప్రభావంతో జట్టులో మార్పులు అవసరమవుతున్నట్లు వాల్టర్ పేర్కొన్నారు. న్యూజిలాండ్ (New Zealand Team) ఫిబ్రవరి 8న చెన్నైలో ఆప్ఘనిస్తాన్‌తో మ్యాచ్ ద్వారా టీ20 వరల్డ్ కప్ 2026 ప్రయాణాన్ని ప్రారంభించనుంది.
Read Also: చరిత్ర సృష్టించిన ఇండొనేషియన్ టెన్నిస్ ప్లేయర్ జానిస్ ట్జెన్
Follow Us On: Instagram


