కలం, వెబ్ డెస్క్: కేరళ (Kerala) బస్సు ప్రయాణంలో దీపక్ అనే వ్యక్తి అనుచితంగా తాకాడని ఆరోపిస్తూ ఓ మహిళ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియో వైరల్ కావడంతో అవమాన భారంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు దీపక్. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు దీపక్ మరణానికి కారణమైన మహిళపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. దీపక్‌ను ఆత్మహత్యకు పురిగొల్పిందని మహిళపై కోజికోడ్ మెడికల్ కాలేజీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
మహిళ తప్పుడు ఆరోపణలు కారణంగా తన కుమారుడు మానసిక వేదన పడ్డాడని దీపక్ తల్లి పోలీసులు ఫిర్యాదు చేసింది. ఆ మహిళపై హత్య అభియోగాలు మోపాలని, దీపక్ మరణానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం పోలీసులు మహిళ కోస గాలింపు చర్యలు చేపట్టారు. ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.


