కలం, వెబ్డెస్క్: పుట్బాల్ క్లబ్ హిస్టరీలో మరో భారీ ఒప్పందం. సుమారు రూ.245 కోట్లతో ఖర్చుతో ఓ ఆటగాడు బదిలీ అయ్యాడు. మాంఛెస్టర్ సిటీ జట్టు డిఫెన్స్ బలోపేతం దిశగా తీసుకున్న కీలక నిర్ణయం ఇది. ఈ మేరకు క్రిస్టల్ ప్యాలెస్ డిఫెండర్ మార్క్ గెహీ (Marc Guehi) ఐదున్నర సంవత్సరాల ఒప్పందంతో సిటీ జట్టులో చేరాడు. ఈ బదిలీకి సుమారు 20 మిలియన్ పౌండ్లు (రూ.245కోట్లు) ఖర్చైనట్లు సమాచారం. సెంటర్-హాఫ్ విభాగంలో గాయాల సమస్యలు వెంటాడటంతో.. ఇంగ్లాండ్ జాతీయ జట్టు ఆటగాడైన గెహీపై సిటీ దృష్టి సారించింది. జనవరి ట్రాన్స్‌ఫర్ విండోలో సిటీ చేసిన రెండో సంతకం ఇదే. అంతకు ముందు బోర్న్‌మౌత్ నుంచి ఘనా వింగర్ ఆంటోయిన్ సెమెన్యోను సొంతం చేసుకుంది.
“మాంఛెస్టర్ సిటీ జెర్సీ ధరించడం గర్వంగా ఉంది. నా కెరీర్‌లో పెట్టిన కష్టానికి వచ్చిన గుర్తింపు ఇది” అని గెహీ (Marc Guehi) వ్యాఖ్యానించాడు. ఈ బదిలీపై సిటీ మేనేజర్ పెప్ గార్డియోలా సంతృప్తి వ్యక్తం చేస్తూ, గెహీ సరైన వయస్సులో జట్టులో చేరాడని, మైదానంలో కుడి, ఎడమ రెండు వైపులా ఆడగల ప్రతిభ అతనికి ఉందని ప్రశంసించారు.
Read Also: గుంటూరులో ఏడాదిగా బాలిక మిస్సింగ్.. జనసేనానిపై తీవ్ర విమర్శలు
Follow Us On : WhatsApp


