కలం, వెబ్ డెస్క్ : దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా నటిస్తున్న సినిమా ఆకాశంలో ఒక తార. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. దర్శకుడు పవన్ సాధినేని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉన్న ఈ సినిమా నుంచి హీరోయిన్ ను పరిచయం చేశారు మేకర్స్. అచ్చ తెలుగు అమ్మాయి సాత్విక వీరవల్లి (Satvika Veeravalli)ని హీరోయిన్ గా పరిచయం చేస్తూ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
ఆకాశంలో ఒక తార (Aakasamlo Oka Tara) సినిమాలో సాత్విక వీరవల్లి పాత్ర కీలకంగా ఉంటుందని గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. ఎన్నో ఆశలు పోగేసుకున్న ఈ అందమైన యువతి, తన కలల్ని నిజం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఎవరు ఏమనుకుంటున్నా తన కలల్ని వెతుక్కుంటూ ఆ యువతి వెళ్లడం గ్లింప్స్ లో ఆకట్టుకుంది. హీరోగా దుల్కర్ సల్మాన్ ఆమెకు ఎలాంటి సపోర్ట్ అందించాడు అనేది మూవీలో చూడాలి.
ఆకాశంలో ఒక తార చిత్రాన్ని ఈ వేసవిలో విడుదల చేయబోతున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా వంటి రెండు బిగ్ బ్యానర్స్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే ఈ సినిమాలో ఒక కొత్త కథను దర్శకుడు పవన్ సాధినేని చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

Read Also: శర్వానంద్ సినిమాకు థియేటర్స్ పెంపు
Follow Us On: Youtube


