epaper
Monday, January 19, 2026
spot_img
epaper

ప్లేయర్ల విషయంలో పీఎస్ఎల్ కీలక నిర్ణయం.. చరిత్రలో తొలిసారి

కలం, వెబ్ డెస్క్ :  పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (PCB) తమ దేశవాళీ క్రికెట్ లీగ్ పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) లో పలు మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది. తాజాగా ఈ మార్పులను ప్రకటించింది. PSL సీజన్ 11 నుంచి ఇప్పటివరకు అమల్లో ఉన్న ప్లేయర్ డ్రాఫ్ట్ విధానాన్ని (Player Draft System) రద్దు చేసి ప్లేయర్ వేలం విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మార్పు లక్ష్యం పోటీ సమతుల్యతను పెంచడం, పారదర్శకతను మెరుగుపరచడం, ఆటగాళ్లకు అధిక ఆదాయ అవకాశాలు కల్పించడం అని పిసిబి ప్రకారం ప్రతి ఫ్రాంచైజీ గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి కేటగిరీ నుంచి ఒక్క ఆటగాడినే నిలుపుకోవాలి. గతంలో అమలులో ఉన్న మెంటర్ బ్రాండ్ అంబాసిడర్ రైట్ టు మ్యాచ్ నిబంధనలను పూర్తిగా రద్దు చేశారు. లీగ్‌లో కొత్తగా చేరిన హైదరాబాద్ (Hyderabad), సియాల్కోట్ (Sialkot) ఫ్రాంచైజీలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. వేలానికి ముందే అందుబాటులో ఉన్న ఆటగాళ్ల నుంచి నలుగురిని ఎంపిక చేసి రిటైన్ చేసుకునే అవకాశం ఇచ్చారు. ప్రతి జట్టుకు PSL 10లో పాల్గొనని ఒక విదేశీ ఆటగాడిని నేరుగా సైన్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈ నిర్ణయం ద్వారా లీగ్‌కు కొత్త అంతర్జాతీయ ప్రతిభను తీసుకురావాలని PCB భావిస్తుంది. ఆటగాళ్ల జీతాల కోసం ఒక్కో జట్టుకు కేటాయించే మొత్తాన్ని USD 1.6 మిలియన్లకు పెంచినట్లు బోర్డు ప్రకటించింది. PSL 11 మార్చి 26 2026న ప్రారంభమవుతుంది. ఈ సీజన్‌తో ఫైసలాబాద్ (Faisalabad) తొలిసారిగా హోస్ట్ నగరంగా మారనుంది. కరాచీ లాహోర్ ముల్తాన్ రావల్పిండి నగరాలతో కలిపి మొత్తం ఐదు నగరాల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

Read Also: నితీష్‌ను వదులుకోవద్దు.. టీమిండియాకు ఇర్ఫాన్ సలహా

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>