కలం వెబ్ డెస్క్ : మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) చేసిన ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్టు చేశారు. కోటరీల చుట్టూ బందీలుగా మారిన ప్రజా నాయకులు ఇప్పటికైనా భవిష్యత్తు గురించి ఆలోచించాలని ఆయన హెచ్చరించారు. “అమ్ముడు పోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోండి. భవిష్యత్తులో ఇక్కడ మీకూ ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండి” అంటూ విజయసాయిరెడ్డి తన పోస్టులో పేర్కొన్నారు. నాయకుల చుట్టూ ఉన్న వ్యక్తుల నిబద్ధత, విశ్వాసం ఎంత ప్రమాదకరంగా మారుతుందో చెప్పేందుకు ఆయన వెనిజువెలాను ఉదాహరణను ప్రస్తావించారు.
వెనిజువెలాలో (Venezuela) భారీ ప్రజాదరణతో ఎన్నికైన అధ్యక్షుడిని, ఆ దేశ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు, మిసైళ్లు, యుద్ధ విమానాలు, పెద్ద సైన్యం ఉన్నప్పటికీ అమెరికా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి ఎత్తుకుపోయిందని గుర్తు చేశారు. ఇంతటి భద్రత ఉన్నా అధ్యక్షుడు, అతడి భార్యను తీసుకెళ్లగలిగారంటే కారణం ఏమిటని ప్రశ్నించారు. వారంతా అమ్ముడు పోవటమే దీనికి కారణమంటూ వ్యాఖ్యానించారు. నాయకుల చుట్టూ ఉన్న కోటరీలు స్వార్థ ప్రయోజనాలకు లోబడి పని చేస్తే, ఎంతటి శక్తివంతమైన నాయకుడైనా క్షణాల్లో బలహీనుడవుతాడని ఆయన హెచ్చరించినట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఎవరిని ఉద్దేశించి ఈ పోస్టు చేశారన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also: వారం రోజుల్లో రూ.877 కోట్ల మద్యం తాగేశారు
Follow Us On : WhatsApp


