కలం, వెబ్ డెస్క్ : ఓ మహిళా కానిస్టేబుల్ చేసిన పనికి హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ (Sajjanar) ఫిదా అయ్యారు. ఆమెకు హ్యాట్సాప్ అంటూ ట్వీట్ చేశారు. ఏపీలోని కాకినాడ–సామర్ల కోట రోడ్డుపై ఆదివారం సాయంత్రం ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయింది. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ (Woman Constable).. ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి చాలా కష్టపడింది. చేతిలో చంటి బిడ్డ ఉన్నా సరే ఆమె ట్రాఫిక్ ను క్లియర్ చేసి.. అంబులెన్స్ కు దారి చూపించింది.
ఈ వీడియోను తాజాగా సీపీ సజ్జనార్ (Sajjanar) పోస్టు చేశారు. ‘ఓ చేతిలో పేగుబంధం.. ఇంకోచేతిలో సమాజ బాధ్యతతో పనిచేసిన రంగంపేట (Rangampeta) మహిళా కానిస్టేబుల్ జయశాంతికి హ్యాట్సాఫ్. డ్యూటీలో లేకపోయినా సమాజ బాధ్యత కోసం పనిచేయడం చాలా సంతోషం. విధుల పట్ల ఆమెకున్న నిబద్ధత కనిపిస్తోందని‘ ప్రశంసించారు సీపీ సజ్జనార్. ప్రస్తుతం ఆ మహిళా కానిస్టేబుల్ జయశాంతిపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
Read Also: వారం రోజుల్లో రూ.877 కోట్ల మద్యం తాగేశారు
Follow Us On : WhatsApp


