epaper
Sunday, January 18, 2026
spot_img
epaper

మంత్రి ఆతిథ్యానికి ముఖ్యమంత్రి ఫిదా!

కలం, ఖమ్మం బ్యూరో : అచ్చమైన తెలంగాణ ఇంటి వంటల రుచులు.. ఆత్మీయ ఆతిథ్యం.. సంప్రదాయ పరిమళం.. ఇవన్నీ కలిసిన ప్రత్యేక విందు ఖమ్మంలో జరిగింది. ఆదివారం ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో ఘనమైన తెలంగాణ వంటకాల విందు ఏర్పాటు చేశారు.

సీఎం ఫిదా..

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti) ఆహ్వానంతో ఏర్పాటు చేసిన ఈ విందులో స్వచ్ఛమైన తెలంగాణ రుచికి సీఎం రేవంత్ రెడ్డి ఫిదా అయ్యారు. “భోజనం అదిరింది.. ఆతిథ్యం మెరిసింది” అన్నట్టుగా సాగిన ఈ విందులో తెలంగాణ నేటివిటి ప్రతి వంటకంలో ఉట్టిపడింది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, సహచర మంత్రులు, ఇతర ముఖ్యులు విందుకు హాజరయ్యారు. ఇది పక్కా తెలంగాణ ఇంటి వంట రుచి అని పేర్కొన్నారు. తెలంగాణ స్టైల్లో వండిన ఘాటైన నాటుకోడి పులుసు.. నోరూరించే రొయ్యల ఇగురు.. చేపల కూర.. అదిరిపోయే మటన్ ఫ్రై.. ప్రత్యేకంగా చేసిన మటన్ కీమా రుచి చూసిన సీఎం వాటిని ఇష్టంగా ఆరగించారు. దాదాపుగా 17 రకాల నోరూరించే వంటకాలతో ముఖ్యమంత్రికి రాజ భోజనం వడ్డించారు.

వంటింటిని పర్యవేక్షించిన మంత్రి సతీమణి మాధురి

ఈ విందులో మంత్రి పొంగులేటి సతీమణి మాధురి (Ponguleti Madhuri) ప్రతి వంటకం సంప్రదాయ రుచులు తగ్గకుండా ఉండేలా స్వయంగా పర్యవేక్షించి తయారు చేయించారు.

శాలువా సత్కారం…హస్తకళా బహుమతి

భోజనం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దంపతులు, మంత్రి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి సీఎం (Revanth Reddy) ని శాలువాతో సత్కరించి, హస్తకళా పెయింటింగ్‌ను బహూకరించారు.

Read Also: మంత్రులపై రేవంత్ కుట్రలు: జగదీష్ రెడ్డి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>