కలం వెబ్ డెస్క్ : పార్టీ మార్పుపై పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(Gudem Mahipal Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పటడుగు వేసి కాంగ్రెస్(Congress) పార్టీలో చేరానని మహిపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. పార్టీ మారినా కాంగ్రెస్‌తో తనకు, నియోజకవర్గానికి, నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి లాభం జరగలేదన్నారు. తదనంతరం ఎదురవుతున్న సమస్యలన్నీ అన్నీ కోర్ట్ ద్వారానే చూసుకుంటున్నానని తెలిపారు. కన్నతల్లిదండ్రుల్లా మరువకుండా తనకు మూడు సార్లు బీఆర్ఎస్(BRS) పార్టీ టికెట్ ఇచ్చిందని గుర్తు చేసుకున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు చెప్పారు. ఐదు మున్సిపాలిటీల్లో 104 మంది కౌన్సిలర్లు ఉన్నారని, అన్ని కేటగిరీల వారీగా విభజించుకొని, ఐదు మున్సిపాలిటీల్లో తమకున్న సత్సంబంధాలతో బీఆర్ఎస్ అభ్యర్థులకు విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.


