కలం, వెబ్ డెస్క్ : విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు (NTR) 30వ వర్ధంతి సంధర్భంగా ఆయనను స్మరించుకుంటూ ప్రముఖులంతా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వర్దంతి సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో సీఎం చంద్రబాబు (Chandrababu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్కు భారత రత్న(Bharat Ratna) అవార్డు ఇవ్వాలి.
ఈ దేశంలో నీతి నిజాయితీగా రాజకీయాలు చేసిన వ్యక్తి, జాతి కోసం పని చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటి వ్యక్తికి భారత రత్న ఇవ్వడం తెలుగు జాతికి గౌరవం, తెలుగు ప్రజల చిరకాల ఆకాంక్ష అని చంద్రబాబు తెలిపారు. తప్పకుండా భారతరత్న సాధించి తీరుతామని ఆయన పేర్కొన్నారు.


