epaper
Sunday, January 18, 2026
spot_img
epaper

కార్యకర్త హత్యపై డీజీపీని కలవనున్న వైసీపీ నేతలు

క‌లం వెబ్ డెస్క్ : పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ (YSRCP) కార్యకర్త మందా సాల్మ‌న్‌ హత్యపై పార్టీ నేతలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఏపీ డీజీపీని (DGP) కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు డీజీపీకి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి (Lella Appi Reddy) లేఖ రాశారు. మందా సాల్మ‌న్‌ దారుణ హత్యతో పాటు రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిపై చర్చించేందుకు తక్షణమే అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కోరారు.

వైసీపీకి కార్యకర్త సాల్మ‌న్‌ అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడటానికి స్వగ్రామానికి వచ్చిన సమయంలో ఇనుప రాడ్లతో దాడి చేసి హత్య చేశారని లేఖలో పేర్కొన్నారు. ఈ హత్య ముందస్తు ప్రణాళికతో జరిగినట్లుగా కనిపిస్తోందని తెలిపారు. ఈ ఘటనతో వైసీపీ కార్యకర్తలు భయాందోళనకు గుర‌వుతున్నార‌ని, ఇది పోలీస్ వ్యవస్థ వైఫల్యాన్ని స్పష్టంగా చేస్తోంద‌ని ఆరోపించారు. ఈ కేసుపై వేగంగా దర్యాప్తు చేప‌ట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. ఈ విషయమై పూర్తి వివరాలు తెలియజేసేందుకు జనవరి 19న సోమ‌వారం అపాయింట్‌మెంట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

 Read Also: ఎన్టీఆర్‌కు తప్పకుండా భారతరత్న సాధిస్తాం : చంద్రబాబు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>