కలం, వెబ్డెస్క్: చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం(UAPA) కింద కేసులు భారీగా, శిక్షలు తక్కువగా నమోదవుతున్నాయి. 2019–23 మధ్య ఐదేళ్లలో ఉపా చట్టం కింద రికార్డయిన కేసులు, శిక్షలు వివరాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు ముప్పు కలిగే సంఘటనల్లో భాగమైన వారిని ఉపా చట్టం కింద అరెస్టు చేస్తారు. ఈ చట్టం కింద 2019–23 మధ్య దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో 5,690 కేసులు రికార్డవగా, 288 మందికి శిక్షలు పడ్డాయి. అంటే కేవలం 5శాతం మందికి మాత్రమే శిక్ష పడింది. ఈ మేరకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ5) నివేదిక వెల్లడించింది.
ఇక 2023లో 1,686 మంది ఉపా (UAPA )కింద అరెస్టవగా, వీరిలో 84 మందికి శిక్ష పడింది. ఇది 4.98శాతం. ఉగ్ర కార్యకలాపాలు ఎక్కువగా కనిపించే జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో 2019–23 మధ్య కాలంతోపాటు 2023 ఏడాదిలోనూ ఉపా కింద శిక్షలు లేవు. అస్సాం, మణిపూర్, మేఘాలయలో వరుసగా 154, 130, 71 కేసులు 2023లో నమోదవగా, ఈ రాష్ట్రాల్లోనూ శిక్షలు పడలేదు.
యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కాక ఉత్తరప్రదేశ్లో ఉగ్రకార్యకలాపాలు, మాఫియా ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ 2023లో ఉపా చట్టం కింద 1,122 కేసులు నమోదయ్యాయి. ఇందులో 75 మందికి (6.68 శాతం) శిక్షలు పడ్డాయి.
Read Also: అవన్నీ కట్టుకథలు, పిట్టకథలు.. సింగరేణి టెండర్ల వివాదంపై భట్టి
Follow Us On : WhatsApp


