epaper
Sunday, January 18, 2026
spot_img
epaper

చరిత్ర సృష్టించిన శ్రీలంక యువ బ్యాటర్

కలం, వెబ్​డెస్క్​: శ్రీలంక యువ బ్యాటర్ విరాన్ చముదిత (Viran Chamuditha) చరిత్ర సృష్టించాడు. శనివారం అద్భుత ప్రదర్శనతో క్రికెట్ చరిత్రలో తన పేరు రాయించుకున్నాడు.జింబాబ్వేలోని బులవాయో వేదికగా జపాన్‌తో జరిగిన ఐసీసీ పురుషుల అండర్-19 వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లో అతడు రికార్డులు బద్దలు కొట్టాడు. ఎడమచేతి బ్యాట్స్‌మన్ అయిన చముదిత 143 బంతుల్లో 192 పరుగులు చేసి అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు.

ఇంతకుముందు ఈ రికార్డు శ్రీలంకకే చెందిన హసిత బోయగోడా పేరిట ఉండేది. 2018లో కెన్యాపై బోయగోడా చేసిన 191 పరుగుల రికార్డ్‌ను చముదిత ఇప్పుడు అధిగమించాడు. చముదితను తిమోతి మూర్ ఔట్ చేసే సమయానికే మ్యాచ్‌లో శ్రీలంక గెలుపు దాదాపు ఖాయమైపోయింది. ఈ సంచలన ఇన్నింగ్స్ మరో చారిత్రక ఘట్టానికి దారి తీసింది. ఓపెనింగ్‌లో దిమంత మహావితానతో కలిసి చముదిత 328 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇది అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో నమోదైన అత్యధిక భాగస్వామ్యం.

ఈ భారీ ఓపెనింగ్ స్టాండ్ బలంతో శ్రీలంక జట్టు 388 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లోనే తమ బలాన్ని స్పష్టంగా చాటింది.

అండర్-19 వరల్డ్‌కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు:
  • విరాన్ చముదిత (శ్రీలంక) – 192 (143 బంతులు) vs జపాన్, 17 జనవరి 2026
  • హసిత బోయగోడా (శ్రీలంక) – 191 (152) vs కెన్యా, 23 జనవరి 2018
  • జాకబ్ భులా (న్యూజిలాండ్) – 180 (144) vs కెన్యా, 17 జనవరి 2018
  • డోనోవన్ పేగన్ (వెస్టిండీస్) – 176 (129) vs స్కాట్లాండ్, 21 జనవరి 2002
  • డాన్ లారెన్స్ (ఇంగ్లండ్) – 174 (150) vs ఫిజీ, 27 జనవరి 2016
అండర్-19 వరల్డ్‌కప్‌లో అత్యధిక భాగస్వామ్యాలు:
  • దిమంత మహావితాన – విరాన్ చముదిత (శ్రీలంక) – 328 vs జపాన్, 17 జనవరి 2026
  • డాన్ లారెన్స్ – జాక్ బర్న్‌హామ్ (ఇంగ్లండ్) – 303 vs ఫిజీ, 27 జనవరి 2016
  • బ్రాడ్ విల్సన్ – బీజే వాట్లింగ్ (న్యూజిలాండ్) – 273 vs స్కాట్లాండ్, 19 ఫిబ్రవరి 2004
  • జేసన్ సంఘా – నాథన్ మెక్‌స్వీనీ (ఆస్ట్రేలియా) – 250 vs పీఎన్‌జీ, 19 జనవరి 2018
  • రచిన్ రవీంద్ర – జాకబ్ భులా (న్యూజిలాండ్) – 245 vs కెన్యా, 17 జనవరి 2018
Viran Chamuditha
Viran Chamuditha

Read Also: పంతం వదలని బంగ్లాదేశ్.. ఐసీసీకి మరో ప్రతిపాదన

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>