కలం, తెలంగాణ బ్యూరో: నలభై మంది ప్రాణాలను కాపాడి తాను తనువు చాలించాడు ఓ డ్రైవరన్న!! ఈ ఘటన సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో శనివారం జరిగింది. జనార్దన్ కొన్నాళ్లుగా ఆర్టీసీలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఎప్పటి లాగే తన డ్యూటీలో భాగంగా బస్సులో ప్యాసింజర్లను ఎక్కించుకొని వస్తుండగా.. వట్ పల్లి మండలం పల్వట్ల దగ్గర ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే పక్కకు బస్సును ఆపేసి.. కుప్పకూలిపోయాడు. ఆ టైమ్ లో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ జనార్దన్ ను (Driver Janardhan) హైదరాబాద్ లోని తార్నాక హాస్పిటల్ కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. డ్రైవర్ అప్రమత్తంగా లేకపోతే పెను ప్రమాదం జరిగేదని, ఆయన ప్రాణాలను కోల్పోతూనే తమ అందరి ప్రాణాలను కాపాడారని ప్రయాణికులు గుర్తుచేసుకుంటున్నారు.
Read Also: ఇక పొట్లాపూర్ లిఫ్ట్ కు మోక్షం.. ఓకే చెప్పనున్న కేబినెట్ !
Follow Us On : WhatsApp


