కలం, తెలంగాణ బ్యూరో: ములుగు జిల్లాలోని పొట్లాపూర్ లిఫ్ట్ (Potlapur Lift Irrigation) స్కీమ్ ఎట్టకేలకు పట్టాలెక్కనుంది. ఆదివారం మేడారంలో జరిగే రాష్ట్ర కేబినెట్ మీటింగ్ ముందుకు ఈ అంశం రానుంది. రామప్ప చెరువుపై పొట్లాపూర్ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనున్నారు. దీని కోసం ఇరిగేషన్ శాఖ రూ. 103 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రెడీ చేసింది. ఇది ఓకే అయితే.. ములుగు మండలంలోని 5 గ్రామాల్లో సుమారు 6 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది.
దేవాదుల ప్రాజెక్టు (Devadula) లోని ప్యాకేజీ 3 పైప్ లైన్ వెంటే పొట్లాపూర్ లిఫ్ట్ స్కీమ్ అలైన్ మెంట్ సాగితే.. భూసేకరణ కోసం అదనపు ఖర్చు అవసరం ఉండదని ఇరిగేషన్ ఆఫీసర్లు కేబినెట్ నోట్ లో పేర్కొన్నట్లు సమాచారం. దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజీ 3 లో నిర్మించిన పంప్ హౌస్ పరిసరాల్లోనే పొట్లాపూర్ లిఫ్ట్ (Potlapur Lift Irrigation) కోసం పంప్ హౌస్ ను నిర్మిస్తే.. దాని అప్రోచ్ కెనాల్ నుంచి నీళ్లు, అదే ట్రాన్స్ కో సబ్ స్టేషన్ నుంచి కరెంట్ తీసుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన జరిగే కేబినెట్ మీటింగ్ లో (Telangana Cabinet) వీటన్నింటిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది.
Read Also: డజను అంశాలతో ఎజెండా ఫిక్స్.. మూడు శాఖలపై క్యాబినెట్ చర్చ
Follow Us On: Instagram


