కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట (Siddipet) జిల్లా తొగుట మండలం జప్తిలింగారెడ్డిపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమారుడు మృత్యువాత పడ్డారు. ధర్మారం గ్రామానికి చెందిన సల్మెడ కుమారస్వామి (39) తన కుమారుడు సుశాంత్ (7), కోడలు రమ్యశ్రీ(7) తో కలిసి ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ (Hyderabad) కు వెళ్తున్నారు.
జప్తిలింగారెడ్డిపల్లి గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న లారీ, ద్విచక్ర వాహనం ఢీ కొన్నాయి. ద్విచక్ర వాహనంపై ఉన్న సుశాంత్ అక్కడికక్కడే మృత్యువాత పడగా, కుమారస్వామిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. రమ్యశ్రీకి తీవ్ర గాయాలు అయ్యాయి. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకులు మృతి చెందడంతో ధర్మారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


