కలం, వెబ్ డెస్క్ : హరిద్వార్‌లోని (Haridwar) హర్ కీ పౌరీ వద్ద హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధిస్తూ బోర్డులు పెట్టడంపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Owaisi) ఘాటుగా స్పందించారు. ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, దేశంలోని ప్రతి పౌరుడికి ఉన్న సమానత్వపు హక్కును కాలరాయడమేనని ఆయన మండిపడ్డారు.
ఇలాంటి నిబంధనలు విధిస్తూ పోతే భవిష్యత్తులో దేశ పరిస్థితులు ఎలా ఉంటాయో ఆలోచించాలని ఒవైసీ ప్రశ్నించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. ఇదే క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో (TTD) ఉన్న నిబంధనలను కూడా ఆయన ప్రస్తావించారు. అక్కడ అన్యమతస్థులు హిందూ మతాన్ని విశ్వసిస్తున్నట్లు రాసి ఇవ్వాల్సి ఉంటుందని గుర్తు చేశారు.
ఉత్తరాఖండ్‌లో జరిగిన ఏంజెల్ చక్మా హత్యను ఇప్పుడు అందరూ మర్చిపోయారని, ఇలాంటి వివక్షాపూరిత దాడులపై ఎవరూ మాట్లాడటం లేదని ఒవైసీ (Owaisi) ఆవేదన వ్యక్తం చేశారు. మతం పేరుతో ప్రజల మధ్య అడ్డు గోడలు కట్టడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన స్పష్టం చేశారు.
Read Also: బీజేపీకి షిండే ఝలక్.. ముంబైలో రిసార్ట్ పాలిటిక్స్ !
Follow Us On: X(Twitter)


